సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Jan 16 , 2026 | 11:42 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం వహించరాదని రాష్ట్ర న్యాయ, మైనార్జీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.
మంత్రి ఫరూక్
నంద్యాల రూరల్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం వహించరాదని రాష్ట్ర న్యాయ, మైనార్జీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నియోజక వర్గం నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.