తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:53 AM
తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించొద్దని నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వ నాథ్ అధికారులను ఆదేశించారు.
నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్
కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించొద్దని నగర పాలక సంస్థ కమిషనర్ విశ్వ నాథ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన క్యాంపు కార్యాల యంలో ఇంజనీరింగ్ విభాగ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిం చాలన్నారు. అతిసారం ప్రబలకుండ ముందస్తు చర్యలు తీసుకోవాల న్నారు. ప్రతిరోజు ఉదయం అన్ని సచివాల యాల పరిధిలో అమ్యూని టీస్ కార్యదర్శులు, తాగునీటి సరఫరా సిబ్బంది సంయుక్తంగా క్లోరిన పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒక్కసారి తాగునీటి ట్యాంకులను శుభ్రపరచాలన్నారు. పైప్‌లైన లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. డ్రైనేజీల్లో ఉన్న పైప్‌లైన్ల తొలగింపులో జాప్యంపై ఆసహనం వ్యక్తం చేశారు. తాగునీటి కొళాయి చార్జీల వసూళ్లను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈ జే.రమణ మూర్తి, ఎంఈ మనోహర్‌రెడ్డి, గిరిరాజ్, డీఈఈలు నరేష్, క్రిష్ణలత, పవనకుమార్‌రెడ్డి, శ్రీనివాసన, సూపరింటెండెంట్ మంజూర్ బాషా, ఏఈలు జనార్ధన, ప్రవీణ్ కుమార్‌రెడ్డి, వైష్ణవి, ఖాసీం, మహేష్ పాల్గొన్నారు.