పొగాకు కంపెనీల మాయాజాలంలో పడొద్దు
ABN , Publish Date - May 27 , 2026 | 12:17 AM
యువత పొగాకు కంపెనీల మాయాజాలంలో పడొద్దని కేఎంసీ(కర్నూలు మెడికల్ కాలేజీ) ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మ హెచ్చరించారు. మంగళవారం స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రపంచ పొగాకు దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది.
కర్నూలు హాస్పిటల్, మే 26 (ఆంధ్రజ్యోతి): యువత పొగాకు కంపెనీల మాయాజాలంలో పడొద్దని కేఎంసీ(కర్నూలు మెడికల్ కాలేజీ) ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మ హెచ్చరించారు. మంగళవారం స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రపంచ పొగాకు దినోత్సవాన్ని పురస్కరించుకుని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఆమె మాట్లాడుతూ పొగాకు వాడటం అంటే కేవలం సిగరెట్, బీడీ తాగడం మాత్రమే కాదని, గుట్కా, పాన్‌మసాలా ఈ సిగరెట్ హుక్కా నషమ్ వంటివి తీసుకున్న క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డా.సీఎస్ కృష్ణ ప్రకాష్ మాట్లాడుతూ క్యాన్సర్ అంటే కేవలం ఊపిరితిత్తుల క్యాన్సర్ మాత్రమే కాదని, నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, అన్నవాహిక, పెద్దప్రేగు, లివర్ క్యాన్సర్లు అనేక రకాలుగా ఉన్నాయన్నారు. వైస్ ప్రిన్సిపాల్ డా.సింథియా శుభప్రధ మాట్లాడుతూ దేశానికి యువత ఎంతో కీలకమని, అలాంటి యువత పొగాకు ఉత్పత్తులకు బానిస కావడం బాధాకరమన్నారు. కర్నూలు జీజీహెచ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డా.ఎ్‌స.లక్ష్మీబాయి, కమ్యూనిటీ మెడిసిన్ వైద్యులు డా.రూపస్, డా.నాగరాజు, డా.చంద్రశేఖర్, డా.సోమశేఖర్, నోడల్ ఆఫీసర్ డా.రవి నాయక్ పాల్గొన్నారు.