బాల్య వివాహాలు చేయకండి
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:29 PM
బాల్య వివాహాలతో సంభవించే అనర్థాలు తెలుసుకొని, మైనర్లకు వివాహాలు చేయవద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి కోరారు. వంద రోజుల బాల్య వివాహాల రహిత భారత్ కార్యక్రమంలో భాగంగా బచ్‌పన్ బచావో ఆందోళన్ ఎన్జీవో మౌనిక సహకారంతో స్థానిక న్యాయ సేవాసదన్ భవన్‌లో ఓ కార్యక్రమం జరిగింది.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి
కర్నూలు లీగల్, మార్చి 3(ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలతో సంభవించే అనర్థాలు తెలుసుకొని, మైనర్లకు వివాహాలు చేయవద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి కోరారు. వంద రోజుల బాల్య వివాహాల రహిత భారత్ కార్యక్రమంలో భాగంగా బచ్‌పన్ బచావో ఆందోళన్ ఎన్జీవో మౌనిక సహకారంతో స్థానిక న్యాయ సేవాసదన్ భవన్‌లో ఓ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలతో పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. ఈ దురాచారంపై ప్రజలలో వాటిపై అవగాహన పెంచాలని అన్నారు. పారా లీగల్ వలంటీర్లు, ఎన్జీ వోలు బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే.. వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ నెంబర్.1098కు గానీ, లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ 15100కు గానీ సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ మెంబర్ డా. రాయపాటి శ్రీనివాస్, న్యాయవాది బాలాజీ, ప్యానెల్ న్యాయవాదులు పాల్గొన్నారు.