Share News

కమనీయం.. ప్రభావళి మహోత్సవం

ABN , Publish Date - Jan 05 , 2026 | 12:23 AM

నీలకంఠేశ్వర స్వామి ఉత్స వాల్లో భాగంగా ఆదివారం ఆలయంలో స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు.

కమనీయం.. ప్రభావళి మహోత్సవం
ప్రభావళి మహోత్సవాన్ని నిర్వహిస్తున్న అర్చకులు

నేడు నీలకంఠేశ్వరుడి మహా రథోత్సవం

ఎమ్మిగనూరు, జనవరి 4(ఆంధ్రజ్యోతి): నీలకంఠేశ్వర స్వామి ఉత్స వాల్లో భాగంగా ఆదివారం ఆలయంలో స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. రాత్రి ప్ర భావళి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తిని ప్రభా వళి రథంలో అధిష్ఠించి ఆలయం నుంచి మేళతాళాలు, భాజా భజంత్రీల మధ్య తేరుబజారు దగ్గరున్న బసవేశ్వరస్వామి ఆలయం వరకు ఊరేగిం చారు. అక్కడ పూజలు నిర్వహించి తిరిగి ఆలయం దగ్గరకు చేర్చారు.

మహా రథోత్సవానికి ఏర్పాట్లు

నీలకంఠేశ్వరస్వామి మహా రథోత్సవం సోమవారం పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగనుంది. కొన్నేళ్లుగా మహా రథోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి మాసంలో (పుష్యమాసం) నిర్వహిస్తూ వస్తున్నారు. స్థానిక తేరు బజారులో రథశాల నుంచి తేరు బజారు చివరనున్న బసవేశ్వరస్వామి ఆలయం వరకు రథాన్ని లాగి తిరిగి యఽథాస్థానానికి తీసుకొస్తారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు తరలిరానున్నారు. రథోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Jan 05 , 2026 | 12:23 AM