Share News

ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - May 04 , 2026 | 10:42 PM

ప్రజా సమస్యల పరి ష్కారంలో నిర్లక్ష్యం వద్దని ఇన్‌చార్జి కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
అర్జీలు స్వీకరిస్తున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌

ఇన్‌చార్జి కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌

కర్నూలు కలెక్టరేట్‌, మే 4(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరి ష్కారంలో నిర్లక్ష్యం వద్దని ఇన్‌చార్జి కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ సూచించారు. నగరంలోని కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఇన్‌చార్జి కలెక్టర్‌ అర్జీలు స్వీకరించారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌ సమస్యల పరిష్కారంపై మరింత శ్రద్ధ తీసుకోవాలన్నారు. పిటిషనర్లకు ఇచ్చే ఎండార్స్‌మెంటును స్పష్టంగా ఇచ్చి సంతృప్తి శాతం పెంచాలన్నారు. ఎండార్స్‌మెంటు స్పష్టంగా ఉండాలని, ఒకవేళ సమస్య పరిష్కరించ లేకపోతే ఎందువల్ల సమస్యను పరిష్కరించలేకపోతున్నామో పిటిషనర్లకు బాగా అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. ఫిర్యాదు అందిన మొ దటి రోజే దానిని పరిశీలించి పరిష్కారానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రీఓపెన్‌ ఇన్‌ప్రాపర్‌ రెడ్రెసల్‌ శాతాన్ని పూర్తిగా తగ్గించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్వో చిరంజీవి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు అనూరాధ, కొండయ్య, సునీత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2026 | 10:42 PM