విధుల్లో అలసత్వం వద్దు
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:58 PM
ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కార్పొరేషన కమిషనర్ పి.విశ్వనాథ్ హెచ్చరించారు.
కార్పొరేషన కమిషనర్ విశ్వనాథ్
కర్నూలు న్యూసిటీ, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కార్పొరేషన కమిషనర్ పి.విశ్వనాథ్ హెచ్చరించారు. బుధవారం ఆయన రామలింగేశ్వర్ నగర్ 115వ సచి వాలయాన్ని తనిఖీ చేశారు. అనుమతి లేకుండా అడ్మిన సెలవు పెట్ట డంపై అసహనం వ్యక్తం చేశారు. సచివాలయంలో హాజరు, మూమెంట్ రిజిస్టర్లు, టీకాల నమోదు పత్రాలు, పింఛన్ల పంపిణీ రికార్డులను పరిశీ లించారు. విధుల నిమిత్తం కార్యాలయం బయటకు వెళ్లే సమయంలో తప్పకుండా మూమెంట్ రిజస్టర్‌లో నమోదు చేసి, సంబంధిత వాట్సాప్ గ్రూపులో లోకేషనతో పాటు ఫొటోలు అప్‌లోడ్ చేయాలని సూచించారు. పింఛన్ల పంపిణీ పూర్తయిన వెంటనే మిగిలిన నగదును ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలని, వ్యక్తిగత ఖాతాల ద్వారా ఎలాంటి లావాదేవీలు చేయరాదని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశిం చిన సర్వేలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అమినిటీస్ కార్యదర్శి బి.ఉదయ్ కుమార్, డబ్ల్యూపీవో కే.సుభద్ర, ఏఎనఎం షాహ పాల్గొన్నారు.