Share News

తప్పుడు కేసులకు భయపడం

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:52 PM

తప్పుడు కేసులకు భయపడబోమని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.

తప్పుడు కేసులకు భయపడం
కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు

ఆదోని కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే, నాయకులు

ఆదోని, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): తప్పుడు కేసులకు భయపడబోమని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. 2024 ఎన్నికల సమయంలో పెట్టిన కేసుల విచారణలో భాగంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, కూటమి పార్టీలకు చెందిన ప్రధాన నాయకులు కలిపి మొత్తం 8 మంది సోమవారం కోర్టుకు హాజరయ్యారు. 2024 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ వేయడానికి వెళ్తన్న తరుణంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం కావాలనే కూటమి నాయకులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కేసులు పెట్టిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తాము ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, కేవలం రాజకీయంగా భయభ్రాంతులకు గురి చేయడానికే తమపై మూడు కేసులు నమోదు చేశారని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో ఎదురు మాట్లాడితే కేసులు పెట్టే సంస్కృతి ఉండేదని, కానీ చంద్రబాబునాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదోనిలో ఎక్కడా దౌర్జన్యాలు, కబ్జాలు లేవని, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని ఆయన పేర్కొరు. ప్రజలు నాటి వైసీపీ అరాచక పాలనకు, నేటి కూటమి సుపరిపాలనకు మధ్య ఉన్న తేడాను గమనించాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.

Updated Date - Feb 02 , 2026 | 11:53 PM