ఆలయాభివృద్ధికి రూ.లక్ష విరాళం
ABN , Publish Date - Jul 10 , 2026 | 01:11 AM
ప్రముఖ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయాభివృద్ధికి ఓ భక్తుడు రూ.లక్ష నగదును చెక్కు రూపంలో విరాళంగా అందజేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్, ఈవో వాణి తెలిపారు.
కౌతాళం, జూలై 9(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయాభివృద్ధికి ఓ భక్తుడు రూ.లక్ష నగదును చెక్కు రూపంలో విరాళంగా అందజేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్, ఈవో వాణి తెలిపారు. గురువారం ఆమె విలేక రులతో మాట్లాడుతూ దేవాలయంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు నంద్యాల జిల్లా పేరుసోముల గ్రామానికి చెందిన నరసప్ప వారి కుటుంబ సభ్యులు రూ. లక్ష చెక్కును ఆలయ కార్యాలయంలో అందజేశారు. దాతలకు ఆలయ అర్చకులు స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించి స్వామివారి లడ్డూ ప్రసాదాలను అందజే శారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు ప్రకాష్ స్వామి ఉన్నారు.