Share News

భౌబోయ్‌

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:16 AM

: పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా కుక్కల బెడదతో ప్రజలు భయపడుతున్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వీధి కుక్కలు దాడులకు పాల్పడుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

భౌబోయ్‌
కొలిమిగుండ్లలో కుక్కల గుంపు

తీవ్రంగా మారిన బెడద ..

కుక్కల దాడిలో గతేడాది ఇరువురు చిన్నారులు మృతి

అంకిరెడ్డిపల్లెలో ఒకే రోజు 12 మందిపై దాడిట

కొలిమిగుండ్ల, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా కుక్కల బెడదతో ప్రజలు భయపడుతున్నారు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వీధి కుక్కలు దాడులకు పాల్పడుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

కుక్కల నియంత్రణ గాలికి

వీధి కుక్కల నియంత్రణకు ప్రభుత్వాలు టీకాలు వేసి, చర్యలు చేపట్టేవారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో పంచాయతీలకు నిధులివ్వని వైసీపీ ప్రభుత్వం కుక్కల నియంత్రణను గాలికి వదిలేసింది. దీంతో వీధి కుక్కల సంతతి విచ్చల విడిగా పెరిగి లక్షలకు చేరింది. పలితంగా ప్రజలు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రేండేళ్లు గడుస్తున్నా అదే పరిస్తితి కొనసాగుతోందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా వీధి కుక్కల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

పిల్లలపై, దాడులు..

పిల్లలు, వృద్ధులపై కుక్కలు ప్రతాపాన్ని చూపుతున్నాయి. గతేడాది బేతంచెర్లలో వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతిచెందగా, కైప గ్రామంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన మరో చిన్నారిని వీధి కుక్కలు బలి తీసుకున్నాయి. అలాగే అంకిరెడ్డిపల్లె గ్రామంలో కుక్కల దాడిలో ఒకే రోజు 12మంది గాయపడ్డారు. మూగజీవాలపై దాడులు

మరోవైపు మేకలు, గొర్రెలపై వీధి కుక్కలు దాడిచేసి చంపుతున్నాయి. దీంతో వాటి యజమానులు త్రీవ అందోళనకు గురవుతున్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో గొర్రె పిల్లల మందలపై కుక్కలు దాడిచేసి చంపిన ఘటనలు కోకొల్లలు.

చర్యలు తీసుకుంటాం..

ఇటీవల కుక్కల సంతతి పెరగడంతో ఇబ్బందులు ఉన్నాయి. నియంత్రణతో పాటు, కుక్కల బెడదపై ఉన్నతాధికారులకు నివేదించి, చర్యలు తీసుకుంటాం. - దస్తగిరిబాబు, ఎంపీడీవో, కొలిమిగుండ్ల

Updated Date - Jun 03 , 2026 | 12:16 AM