ప్రభుత్వానికి కరువు కనిపించదా?
ABN , Publish Date - Sep 15 , 2026 | 11:25 PM
రాయలసీమ ప్రాంతాన్ని కరువు కమ్మేస్తున్నా ప్రభుత్వానికి కనిపించదా అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ
ఆలూరు, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాయలసీమ ప్రాంతాన్ని కరువు కమ్మేస్తున్నా ప్రభుత్వానికి కనిపించదా అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఆలూరు, మొలగవల్లి గ్రామాల్లోని పొలాలను సీపీఐ కరువు బృందం పరిశీలించింది. రైతులతో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లాలోని ఆలూరు, పత్తికొండ ప్రాంతాల్లో కరువు ప్రభావం తీవ్రంగా ఉందని, రైతులు సాగునీరు లేక పంటలను కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాల కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, పెట్టుబ డులు పెట్టి సాగుచేసినా దిగుబడులు వచ్చే పరిస్థితి లేదని రైతులు కరువు బృందం దృష్టికి తీసుకెళ్లారు. కరువు తీవ్రతను గుర్తించి వెంటనే కరువు మండలాలను ప్రక టించాలని, రైతులకు తక్షణ కరువు సహాయక చర్యలు అందించాలని డిమాండ్ చేశా రు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుకు ఏవిధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో అదేవిధంగా రాయలసీమకు కీలకమైన వేదవతి ప్రాజెక్టుకు కూడా ప్రాధా న్యత ఇచ్చి అవసరమైన నిధులు విడుదల చేయాలన్నారు. రైతుల కష్టాలను ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన సీపీఐ ఆధ్వర్యంలో మరింత పెదఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు భూపేష్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.రామాంజనేయులు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాట మయ్య, జిల్లా సహాయక కార్యదర్శి లెనిన్‌బాబు, సీపీఐ మండల కార్యదర్శి ఎస్‌ఎస్ బాషా, మండల సహాయ కార్యదర్శి చంద్రకాంత్‌రెడ్డి, సీనియర్ నాయకులు ఎర్రిస్వామి, రైతు సంఘం మండల అధ్యక్షులు చాపల గోపాల్, ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు శివప్ప, అబ్దుల్‌గని, సిద్ధిలింగ, మహేష్, జాఫర్ ఉన్నారు.