Share News

15 నిమిషాల్లో డాక్యుమెంట్లు

ABN , Publish Date - Jan 29 , 2026 | 11:16 PM

స్థిరాస్తుల రిజిస్ర్టేషన్‌ కోసం స్లాట్‌బుక్‌ చేసుకున్నవారికి 15 నిమిషాల్లో డాక్యుమెంట్లను అందజేయనున్నట్లు స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(డీఐజీ) వి.కిరణ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

15 నిమిషాల్లో డాక్యుమెంట్లు
దస్తావేజులు అందజేసిన డీఐజీ కిరణ్‌కుమార్‌

రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ కిరణ్‌ కుమార్‌

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయల్లో తనిఖీలు

కల్లూరు, జనవరి, 29 (ఆంధ్రజ్యోతి): స్థిరాస్తుల రిజిస్ర్టేషన్‌ కోసం స్లాట్‌బుక్‌ చేసుకున్నవారికి 15 నిమిషాల్లో డాక్యుమెంట్లను అందజేయనున్నట్లు స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌(డీఐజీ) వి.కిరణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. గురువారం ఆయన కర్నూలు, కల్లూరు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్లాట్‌బుక్‌ చేసుకున్న ప్రజలకు సకాలంలో అందుతున్నాయా? లేదా? అన్నవిషయంపై ఆరా తీశారు. రిజిస్ర్టేషన్‌ కోసం వచ్చిన ప్రజలకు సకాలంలో సేవలు అందేలా చూడాలని సబ్‌ రిజిస్ర్టార్లను ఆదేశించారు. ప్రజలు రిజిస్ర్టేషన్‌ శాఖలో సేవలపై ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నెంబరు 1100కు ఫోన్‌ చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా స్లాట్‌ బుక్‌ చేసుకున్న వినియోగదారులకు 15 నిమిషాల్లో దస్తావేజులను డీఐజీ అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు, కల్లూరు సబ్‌ రిజిస్ర్టార్లు కె.శ్రీనివాసరావు, బి.ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2026 | 11:16 PM