వైద్యులు పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:59 PM
వైద్యులు తమ పరిజ్ఞానాన్ని మరింత పెంచుకోవాలని కర్నూలు మెడికల్ కాలేజీ (కేఎంసీ) ప్రిన్సిపాల్ డా.కే చిట్టినరసమ్మ అన్నారు.
కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ చిట్టినరసమ్మ
ఈఎన్‌టీ వైద్యుల రాష్ట్ర సదస్సు ప్రారంభం
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వైద్యులు తమ పరిజ్ఞానాన్ని మరింత పెంచుకోవాలని కర్నూలు మెడికల్ కాలేజీ (కేఎంసీ) ప్రిన్సిపాల్ డా.కే చిట్టినరసమ్మ అన్నారు. కర్నూలు నగర శివారులోని కే.ఫార్చూన్ హోటల్‌లో 44వ రాష్ట్ర స్తాయి ఈఎన్‌టీ వైద్యుల సదస్సును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డా.పి.చంద్రశేఖర్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డా.నందకిషోర్, ఆర్గనైజింగ్ చైర్మన్ డా.పి.హరికృష్ణ, ఈఎన్‌టీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్గనైజింగ్ కార్యదర్శి డా.బి.జయప్రకాష్ రెడ్డి, కోశాధికారి డా.ఎం.మహేంద్ర కుమార్, రిటైర్డు ప్రిన్సిపల్ డా.జి.రాంప్రసాద్‌తో కేఎంసీ ప్రిన్సిపాల్ జ్యోతి ప్రజ్వలన చేసి శనివారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ వైద్యరంగంలో వస్తున్న నూతన చికిత్స విధానాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈఎన్‌టీ వైద్య రంగంలో శాస్త్రీయ కా ర్యక్రమాల ప్రాధాన్యత, వైద్యుల పరిజ్ఞానం, నైపుణ్యాల అభివృద్ధి గురించి వివరించారు. డా. నందకిషోర్ మాట్లాడబుతూ కొన్నేళ్లుగా ఈఎన్‌టీ వైద్యరంగంలో గణనీయమైన మార్పులు, అభివృద్ధి చోటు చేసుకున్నాయన్నారు. ఆధునిక వైద్య అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఈఎన్‌టీ వైద్యులు, ఉపన్యాసాలు, ప్రజెంటేషన్లు అందించారు. ముఖ్యంగా మైక్రోలారింజాలజి, నోటి క్యాన్సర్, టైంపనోప్లాస్టీ, అలర్జిక్ రైనైటిస్, టెంపోరల్‌బోన్ మాలిగ్నెన్సి, తల, మెడ క్యాన్సర్లు, థైరాయిడ్ వ్యాధులపై ప్రసంగించారు. కేఎంసీకి చెందిన పూర్వ విద్యార్థులు సీనియర్ ఈఎన్‌టీ వైద్యులు డా.జే.శ్రీనాథ్ (అనంతపురం), డా.సింగారి ప్రభాకర్ (విజయ వాడ), వారి విశేష కృషికి గుర్తింపుగా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రిన్సిపాల్ డా.కే. చిట్టినరసమ్మ, ఏపీఎంసీ చైర్మన్ డా.నందకిషోర్ ఈఎన్‌టీ రాష్ట్ర వైద్యుల సంఘం అధ్యక్షుడు డా.బి.జయప్రకాష్ రెడ్డి, ఆర్గనైజింగ్ చైర్మన్ డా.పి.హరికృష్ణ అందజేశారు.