Share News

డాక్టర్‌..! మీరు బదిలీ అవుతున్నారా?

ABN , Publish Date - Sep 10 , 2026 | 12:35 AM

కర్నూలు సర్వజన వైద్యశాలలో కార్డియోథోరాసిక్‌ విభాగంలో పని చేస్తున్న డా. ప్రభాకర్‌రెడ్డి పేదలకు ఆప్తుడు. అయన పెద్దాసుపత్రిలో ఉండటమే పేదలకు భరోసా. ఆయన బదిలీ కాబోతున్నారనే వార్త రోగులకు ఆందోళనకు గురి చేస్తోంది. 2016సెప్టెంబరులో అప్పటి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య రూ.6కోట్ల వ్యయంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రీజినల్‌ కార్డియోథోరాసిక్‌ విభాగాన్ని ప్రారంభించారు.

డాక్టర్‌..!  మీరు బదిలీ అవుతున్నారా?
డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డిని కిలిసిన సాజిదాబీ

డా. ప్రభాకర్‌ రెడ్డిని కలుస్తున్న రోగులు

కార్డియోథోరాసిక్‌ విభాగానికి క్యూ

కన్నీరు పెట్టుకుంటున్న రోగులు

కర్నూలు హాస్పిటల్‌, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): కర్నూలు సర్వజన వైద్యశాలలో కార్డియోథోరాసిక్‌ విభాగంలో పని చేస్తున్న డా. ప్రభాకర్‌రెడ్డి పేదలకు ఆప్తుడు. అయన పెద్దాసుపత్రిలో ఉండటమే పేదలకు భరోసా. ఆయన బదిలీ కాబోతున్నారనే వార్త రోగులకు ఆందోళనకు గురి చేస్తోంది. 2016సెప్టెంబరులో అప్పటి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య రూ.6కోట్ల వ్యయంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రీజినల్‌ కార్డియోథోరాసిక్‌ విభాగాన్ని ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో కర్ణాటక, బళ్లారి జిల్లాల నుంచి వచ్చే రోగులు 2వేల మందికి పైగా గుండె ఆపరేషన్లు, బైపాస్‌ సర్జరీలు, బీటింగ్‌ హార్ట్‌ సర్జరీలు, వాల్వ్‌ రిప్లే్‌సమెంట్‌, మినిమల్లీ, ఇన్వెసివ్‌ హార్ట్‌ సర్జరీలు పుట్టకతోనే గుండె లోపాలున్న పిల్లలకు ఆపరేషన్లు డయాలసిస్‌ రోగుల కోసం ఏవీ ఫిస్టులా శస్త్రచికిత్సలను సీటీవీఎస్‌ విభాగాధిపతి సీనియర్‌ ప్రొఫెసర్‌ డా.సి. ప్రభాకర్‌ రెడ్డి నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు. కార్డియోథోరాసిక్‌ విభాగానికి ఈయన హయాంలో ఎంతో గుర్తింపు వచ్చింది. ప్రైవేటు హాస్పిటల్‌లో చేయలేని కేసులను శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి, నల్లగొండ, హైదరాబాదు నుంచి రోగులు వచ్చి ఇక్కడ శస్త్ర చికిత్సలు విజయవంతం చేయించుకుని వెళ్తున్నారు.

బదిలీ అవుతారనీ రోగులు క్యూ

కార్డియోథ్రోఆసిక్‌ సర్జన్‌ సీనియర్‌ ప్రొఫెసర్‌ డా. ప్రభాకర్‌ రెడ్డికి ఇటీవల అడిషనల్‌ డీఎంఈగా పదోన్నతి లభించింది. దీంతో ఆయన నంద్యాలకు బదిలీ అవుతారని సమాచారం తెలుసుకుని గుండె ఆపరేషన్లు చేయించుకున్న రోగులు సీటీవీఎస్‌ విభాగానికి వచ్చి డా. ప్రభాకర్‌ రెడ్డిని కలుస్తున్నారు. బుధవారం కర్నూలు జీజీహెచ్‌లోని కార్డియోథోరాసిక్‌ విభాగంలో 2016 సెప్టెంబరు 21 నందికొట్కూరుకు చెందిన 21ఏళ్ల సాజిదాబీకి మొట్టమొదటి బైపాస్‌ ఆపరేషన్‌ను డా.ప్రభాకర్‌ రెడ్డి విజయవంతంగా నిర్వహించారు. పదేళ్ల తర్వాత మొట్టమొదటిసారి బైపాస్‌ సర్జరీ చేయించుకున్న సాజీదాబీ డా.ప్రభాకర్‌ రెడ్డిని కలిసి కన్నీళ్లు పెట్టుకుంది. మీ రుణం తీర్చుకోలేనిదని మీరు బదిలీ అవుతున్నారని తెలుసుకుని ఇక్కడికి వచ్చానన్నది. అలాగే ఆయనతో గుండె ఆపరేషన్లు చేయించుకున్న రోగులు వచ్చి డా.ప్రభాకర్‌ రెడ్డిని అభినందిస్తూ వెళ్తున్నారు.

ఆందోళనలో రోగులు

రాష్ట్రంలోని కార్డియోథోరాసిక్‌ సర్జన్‌గా పేరుగాంచిన డా. ప్రభాకర్‌ రెడ్డి బదిలీపై నంద్యాలకు వెళితే సీటీవీఎస్‌ విభాగం మూతపడే అవకాశం ఉందని కొందరు రోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన నంద్యాలకు సూపరింటెండెంట్‌గా వెళితే అక్కడ బైపా్‌ససర్జరీలు చేయడానికి సౌకర్యాలు లేకపోయినా పరిపాలనాపరంగా ఆ బాధ్యతను నెరవేర్చాల్సిందే. అందువల్ల డా.ప్రభాకర్‌ రెడ్డి సేవలను కర్నూలులోనే కొనసాగించాలని కొన్ని ప్రజాసంఘాలు కోరుతున్నాయి.

Updated Date - Sep 10 , 2026 | 12:35 AM