పనులు వేగవంతం చేయాలి
ABN , Publish Date - May 27 , 2026 | 12:09 AM
పట్టణంలో చేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాశ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అఽధికారులను ఆదేశించారు.
అధికారులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశం
బనగానపల్లె, మే 26 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో చేస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాశ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అఽధికారులను ఆదేశించారు. మంగళవారం పెండేకంటినగర్, ఇతర కాలనీల్లో పనులను స్వయంగా పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. పనులు త్వరతగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అలాగే పట్టణంలో గ్రామ పంచాయతీ భవనం పనులను మంత్రి పరిశీలించారు. అబివృద్ధి పనులు నాణ్యంగా చేయాలని, పనులు పూర్తయితే పట్టణ రూపురేఖలే మారిపోతాయని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో పంచాయితీరాజ్ డీఈ నాగశ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.