శాంతి ర్యాలీని జయప్రదం చేయాలి
ABN , Publish Date - May 11 , 2026 | 12:08 AM
క్రైస్తవ మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగించాలని కోరుతూ సోమవారం చేపడుతున్న క్రైస్తవుల శాంతి ర్యాలీని వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని అంబేడ్కర్ భవన సాధన కమిటీ చైౖర్మన్ కదిరికోట ఆదెన్న, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్, యన్‌సీసీ కదిరికోట వెస్లీ సునీల్‌ల పిలుపునిచ్చారు.
ఎమ్మిగనూరు టౌన్, మే 10 (ఆంధ్రజ్యోతి): క్రైస్తవ మతం మారిన దళితులకు ఎస్సీ హోదా కొనసాగించాలని కోరుతూ సోమవారం చేపడుతున్న క్రైస్తవుల శాంతి ర్యాలీని వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని అంబేడ్కర్ భవన సాధన కమిటీ చైౖర్మన్ కదిరికోట ఆదెన్న, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్, యన్‌సీసీ కదిరికోట వెస్లీ సునీల్‌ల పిలుపునిచ్చారు. ఆదివారం వారు మాట్లాడుతూ పాస్టర్ చింతాడ ఆనంద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు క్రైస్తవ మతం మారిన దళితులకు రిజర్వేషన్లు వర్తించవని, ఎస్సీ హోదా కోల్పోతారని సంచలన తీర్పు ఇవ్వడం రాజ్యాంగం విరు ద్దమని అన్నారు. షెడ్యూల్ కులాలకు చెందిన వారు మతం మారినంత మాత్రాన వారి సామాజిక పరిస్థితులు, హోదా మారలేదన్నారు. మతం మారే స్వేచ్చ లేనప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14,15,25లు ఎందుకని ప్రశ్నించారు. సోమవారం ఉదయం 9గంటలకు పట్టణంలోని ఎంబీ చర్చి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు జరిగే శాంతి ర్యాలీలో వేలాది మంది దళిత క్రైస్తవులు తరలిరావాలని పిలుపు నిచ్చారు.కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు సప్పోగు తిమ్మన్న, సుమాల అంతోని, రాజా రమేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ హోదా కల్పించేవరకు పోరాటం
గోనెగండ్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే వరకు పోరాటం చేస్తామని ఎంఆర్‌పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మహదేవ్ అన్నారు. ఆదివారం గోనెగండ్లలోని దళిత క్రైస్తవులతో సమావేశం నిర్వహిం చారు. ఆయన మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ ఎమ్మిగనూరులో సోమవారం ఉదయం 10గంటలకు శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నా మని అన్నారు. దళిత క్రైస్తవులు పాల్గొన్ని విజయవంతం చేయా లని కోరారు.