Share News

ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహిచుకోవాలి

ABN , Publish Date - Sep 10 , 2026 | 12:40 AM

ఈనెల 14 నుంచి గణేష్‌ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహిచుకుని, పోలీసులకు సహకరించాలని ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు కోరారు. బుధవారం సాయంత్రం స్థానిక పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఎస్‌ఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో పీస్‌కమిటీ సమావేశం నిర్వహించారు

ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహిచుకోవాలి
పీస్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ

ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు

చాగలమర్రి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఈనెల 14 నుంచి గణేష్‌ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహిచుకుని, పోలీసులకు సహకరించాలని ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు కోరారు. బుధవారం సాయంత్రం స్థానిక పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఎస్‌ఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో పీస్‌కమిటీ సమావేశం నిర్వహించారు. మండపాల ఏర్పాటుకు పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని, సూచనలు పాటించాలన్నారు. ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకుంటే దరఖాస్తు చేసుకున్న పోలీసు స్టేషన్‌ పరిధిలోని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధృవీకరిస్తారని అన్నారు. ప్రభుత్వ నిబంధనలను, భధ్రత నిబంధనలకు అనుగునంగా దరఖాస్తులను ఆమోదిస్తామని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. నిమజ్జనాన్ని కూడా ప్రశాంతంగా చేసుకోవాలని, మత సామరస్యాన్ని పాటించాలన్నారు. ఆళ్లగడ్డ సీఐ బీవీ రమణ, ఎంపీడీవో తాహిర్‌హుసేన్‌, డీటీ వెంకటరవి, విద్యుత్‌ ఏఈ రమణయ్య, ఈవో షబియా, ప్రభుత్వ ఖాజీ యూనస్‌, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గుత్తి నరసింహులు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

గొడవలకు పాల్పడితే కఠినచర్యలు

కొలిమిగుండ్ల: గ్రామాల్లో అలజడి సృష్టించి, గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. నాలుగు రోజుల క్రితం అంకిరెడ్డిపల్లెలో ఘరణ చోటుచుసుకోవడంతో బుధవారం డీఎస్పీ గ్రామంలో పర్యటించారు. గ్రామస్థులతో మాట్లాడిన హెచ్చరికలు జారీచేశారు. అనంతరం మరో సమస్మాత్మక గ్రామమైన చింతలాయపల్లె గ్రామంలోనూ పర్యటించారు. సీఐ రమే్‌షబాబు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2026 | 12:41 AM