Share News

కార్బైడ్‌ వాడకూడదు

ABN , Publish Date - May 12 , 2026 | 11:17 PM

మామిడి, అరటి పం డ్లను మాగపెట్టడానికి కార్బైడ్‌ వంటి నిషేధిత రసాయనాలను ఉప యోగించరాదని, సహజ పద్ధతి, చీకటి గదిలో గాలి ప్రవేశం తక్కువగా ఉండేలా నిల్వచేయాలని నంద్యాల జిల్లా పుడ్‌ సేఫ్టీ అధికారులు వెంకట రాముడు, కాశింవలి పండ్ల వ్యాపారులకు సూచించారు.

కార్బైడ్‌ వాడకూడదు
మామిడి పండ్లను తనిఖీ చేస్తున్నఫుడ్‌ సేఫ్టీ అధికారులు

పండ్లను మాగపెట్టేందుకు అతిగా ఇఽథలీన్‌ వాడితే చర్యలు

ఫుడ్‌ సేఫ్టీ అధికారి వెంకటరాముడు

నంద్యాల కల్చరల్‌, మే 12(ఆంధ్రజ్యోతి): మామిడి, అరటి పం డ్లను మాగపెట్టడానికి కార్బైడ్‌ వంటి నిషేధిత రసాయనాలను ఉప యోగించరాదని, సహజ పద్ధతి, చీకటి గదిలో గాలి ప్రవేశం తక్కువగా ఉండేలా నిల్వచేయాలని నంద్యాల జిల్లా పుడ్‌ సేఫ్టీ అధికారులు వెంకట రాముడు, కాశింవలి పండ్ల వ్యాపారులకు సూచించారు. మంగళవారం నంద్యాల మార్కెట్‌ యార్డులో నంద్యాల జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, మున్సిపల్‌ అధికారులు, కన్‌జ్యూమర్స్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వ ర్యంలో పండ్ల మార్కెట్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్‌లో విక్రయిస్తున్న మామిడి పండ్లు, సపోటా, ఆపిల్‌, దానిమ్మ తదితర పండ్ల రకాలను పరిశీలించి వ్యాపారులకు సూచనలు ఇచ్చారు. మామిడి పం డ్లను కార్బైడ్‌ వంటి నిషేధిత రసాయనాలను, 25 కిలోలకు రెండు కంటే ఎక్కువ ఇథిలీన్‌ ప్యాకెట్లను ఉపయోగిస్తే ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా చట్టం ప్రకారం నేరమని, ఒక సంవత్సరం జైలు శిక్ష, మూడు లక్షల రూపాయల జరిమానా ఉంటుందని తెలిపారు. తనిఖీలలో భాగంగా కొన్ని పండ్లను సేకరించి పరీక్ష నిమిత్తం చెన్పైలోని బ్యూరో హెరిటేజ్‌ ల్యాబొరేటరీకి పంపించామన్నారు. ప్రయోగశాల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - May 12 , 2026 | 11:17 PM