Share News

ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు

ABN , Publish Date - Oct 03 , 2026 | 11:29 PM

మహిళలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సూచించారు.

ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
నంద్యాలలో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి

రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించాలి

కలెక్టర్‌ రాజకుమారి

పట్టణంలో అవగాహన ర్యాలీ

నంద్యాల హాస్పిటల్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : మహిళలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి సూచించారు. రొమ్ము క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు శనివారం పట్టణంలోని మున్సిపల్‌ టౌన్‌ హాల్‌ నుంచి టెక్కె మార్కెట్‌ యార్డ్‌ వరకు నిర్వహించిన పింక్‌ మారథాన్‌ ర్యాలీని ఎంపీ, కలెక్టర్‌ రాజకుమారి ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ చాలా మంది మహిళలు కుటుంబ బాధ్యతలు, ఇంటి పనుల్లో నిమగ్నమై తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, మహిళల ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్‌పై మహిళల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స పొందేలా చైతన్యం తీసుకురావడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఆధునిక వైద్య సాంకేతికత అందుబాటులో ఉందన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మారథాన్‌లో వైద్యులు, విద్యార్థులు, ప్రజలు పింక్‌ క్యాప్‌లు ధరించి అధిక సంఖ్యలో పాల్గొనడం ద్వారా రొమ్ము క్యాన్సర్‌పై పోరాటానికి తమ సంఘీభావాన్ని చాటారని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 11:29 PM