Share News

ఓటు హక్కును కోల్పోవద్దు

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:10 AM

‘ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం లాంటిది. అంత విలువైన ఓటు హక్కును ఎవరూ కోల్పోకూడదు..’ అని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు పిలుపునిచ్చారు.

ఓటు హక్కును కోల్పోవద్దు
‘సర్‌’ ప్రక్రియను పరిశీలిస్తున్న కమిషనర్‌ చల్లా ఓబులేసు

నగర పాలక కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, జూలై 14(ఆంధ్రజ్యోతి): ‘ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం లాంటిది. అంత విలువైన ఓటు హక్కును ఎవరూ కోల్పోకూడదు..’ అని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన పాతబస్టాండు, కొత్తపేట ప్రాంతాలకు చెందిన పోలింగ్‌ కేంద్రాల పరిఽధిలో సర్‌ ప్రక్రియను పరిశీలించారు. కమిషనర్‌ మాట్లాడుతూ సర్‌ ప్రక్రియ గడువును ఈనెల 24వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంకా ఎన్యుమరేషన పూర్తి చేయని ఓటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకుండా సంబంధిత బీఎల్‌వోను సంప్రదించి అవసరమైన వివరాలను సమర్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఈఆర్‌వో, డిప్యూటి కమిషనర్‌ సతీష్‌ కుమార్‌రెడ్డి, అసిస్టెంట్‌ ఏఈఆర్‌వో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సూపర్‌వైజర్‌ సొహైల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 12:10 AM