బియాండ్ ఎస్‌ఎల్‌ఏ వెళ్లకూడదు
ABN , Publish Date - Aug 24 , 2026 | 11:08 PM
ప్రజల అర్జీలు బియాండ్ ఎస్‌ఎల్‌ఏ వెళ్లకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : ప్రజల అర్జీలు బియాండ్ ఎస్‌ఎల్‌ఏ వెళ్లకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించేది లేదని, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థపై నిర్వహించిన సమీక్షలో జిల్లాలో 4,543 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నట్లు, 76 ఫిర్యాదులు రీఓపెన్ అయినట్లు తెలిపారు. అర్జీల పరిష్కారంలో బియాండ్ ఎస్‌ఎల్‌ఎ వెళ్లడం ద్వారా జిల్లా ర్యాంకింగ్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్వో రామునాయక్, పీజీఆర్‌ఎస్ నోడల్ ఆఫీసర్ ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ పర్యటన
భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్‌గా నియమితులైన పి. ప్రశాంతి 25, 26 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం 10 గంటలకు నంద్యాల నుంచి బయలుదేరి 134- ఆళ్లగడ్డ, 135- శ్రీశైలం, 139- నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు తెలిపారు. బుధవారం జిల్లాలోని ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్ష సమావేశం నిర్వహించి సర్ ప్రక్రియ పురోగతి, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలను సమీక్షించనున్నట్లు తెలిపారు.
జనగణన హ్యాండ్ బుక్ డేటా సేకరణ నాణ్యతతో చేపట్టాలి
జనగణన హ్యాండ్ బుక్ డేటా సేకరణ నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. జనగణన హ్యాండ్ బుక్ డేటా సేకరణ, లాక్డ్ ఇళ్ల సర్వే ప్రక్రియలపై డిస్టిక్ సెన్సెస్ ఇన్‌చార్జి అధికారిని విష్ణుమాధురితో కలిసి సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనగణన హ్యాండ్‌బుక్ డేటా సేకరణ ప్రక్రియ ఈ నెల 17వ తేదీ నుంచి సెప్టెంబరు 15వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.
పనుల పురోగతిని పెంచాలి
జలధార-జలహారతి పనులను వేగవంతంగా ప్రారంభించి, క్షేత్ర స్థాయిలో పనుల పురోగతిని పెంచాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశిం చారు. సోమవారం పీజీఆర్‌ఎస్ హాల్లో జలధార- జలహారతి కార్యక్రమం అమలు, పనుల ప్రగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిం చారు.