కాలువల్లో చెత్త వేయొద్దు
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:51 PM
ప్రజలు కాలువల్లో చెత్తను వేయడం వల్ల మురుగు ప్రవాహానికి ఇబ్బందిగా మారిందని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు.
నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, జూన 13(ఆంధ్రజ్యోతి): ప్రజలు కాలువల్లో చెత్తను వేయడం వల్ల మురుగు ప్రవాహానికి ఇబ్బందిగా మారిందని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. శని వారం ఉదయం కురిసిన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాల్లోని డ్రైనేజీలను పరిశీలిస్తూ వ్యర్థాల తొల గింపు పనులను ఆయన పర్యవేక్షించారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడు తూ డ్రైనేజీలకు వ్యర్థాలు అడ్డుపడి అవి మూసుకుపోవడంతో వర్షపునీరు సక్రమంగా ప్రవహించక రోడ్లపైకి చేరుతోందన్నారు. దీంతో వాహనాల రాకపోక లకు తీవ్ర ఆటంకం కలుగుతుంద న్నారు. పాత కల్లూరు వక్కెవాగు పక్కన డైమండ్ ఫం క్షన హల్ నిర్వాహకులు వ్యర్థాలను వాగులో వేస్తుండటాన్ని గమనించిన కమి షనర్ ఫంక్షన హాల్‌కు రూ.10వేలు జరిమానా విధించాలని ఆదేశించారు. ఏఈ జనార్దన, శానిటేషన ఇన్సస్పెక్టర్లు మునిస్వామి, అనిల్, కూర్మయ్య పాల్గొన్నారు.