ఆహార నాణ్యతలో రాజీ పడొద్దు
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:30 AM
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత విష యంలో అధికారులు, సిబ్బంది రాజీ పడొద్దని కలెక్టర్ సిరి అన్నారు.
కలెక్టర్ సిరి
కర్నూలు ఎడ్యుకేషన, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత విష యంలో అధికారులు, సిబ్బంది రాజీ పడొద్దని కలెక్టర్ సిరి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సంక్షేమ శాఖలకు సంబంధించిన పురోగతిపై అన్ని సంక్షేమ వసతి గృహాల అధికారులు, ప్రిన్సిపాల్స్, వార్డెన్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మా ట్లాడుతూ వసతి గృహాలను తరుచూ తనిఖీలు చేస్తాననీ, ఆ సమయంలో లోపాలు కనిపిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. వసతి గృహాల వార్డెన్లు, కుక్‌లు పారిశుధ్య సిబ్బందికి ప్రతి నెల సెన్సిటైజేషన కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశిం చారు. వసతి గృహాల్లో టాయిలెట్లు, గదులు, హాస్టల్ ప్రాంగణం, గదులు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకా రం భోజనం అందించాలని, వార్డెన్లు పని చేసే చోటనే నివాసం ఉండా లని, పెండింగ్ పనులను సెప్టెంబరు నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి ప్రసూన, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి డి.సురేష్, డ్వామా పీడీ నరసింహారెడ్డి, వార్డెన్లు, సహాయ సంక్షేమ శాఖాధికారులు, పాల్గొన్నారు.