సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Jun 22 , 2026 | 11:08 PM
ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అర్జీదారులు పూర్తిగా సం తృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) వెంకట నారాయణమ్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.
డీఆర్వో వెంకట నారాయణమ్మ
కర్నూలు కలెక్టరేట్, జూన్ 22(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అర్జీదారులు పూర్తిగా సం తృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) వెంకట నారాయణమ్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం నిర్వ హించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వివిద సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. డీఆర్వో మాట్లాడుతూ ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టి, వాస్తవ పరిస్థితులను తెలుసుకుని సమస్య పరి ష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. పీజీ ఆర్‌ఎస్‌లో నమోదవుతున్న రీఓపెన్, ఇన్‌ప్రాపర్ రెడ్రెసల్ కేసుల సంఖ్యను పూర్తిగా తగ్గించే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్ర మంలో జడ్పీ సీఈవో వెంకటరమణారెడ్డి, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ దీప్తి, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్ డా.లోక్‌రాజు, వివిద శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.