Share News

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:55 PM

ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యతతో కూడిన పరిష్కారాలను అందించాలని కలెక్టర్‌ సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు.

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ సిరి

కర్నూలు కలెక్టరేట్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యతతో కూడిన పరిష్కారాలను అందించాలని కలెక్టర్‌ సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎ్‌సలో కలెక్టర్‌ ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారపై అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పీజీఆర్‌ఎ్‌సలో నమోదవుతున్న రీఓపెన్‌, ఇంప్రాపర్‌ రెడ్రెసల్‌ కేసుల శాతాన్ని పూర్తిగా తగ్గించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై విధులు, శిక్షణ సిబ్బంది కేటాయింపు, పోస్టల్‌ బ్యాలెట్‌ తదితర అంశాలకు సంబంధించిన మార్గదర్శకాలు, మాన్యువల్స్‌ను అధికారులు పూర్తిగా అధ్యయనం చేసి నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ నూరుల్‌ ఖమర్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2026 | 11:55 PM