అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:35 PM
ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి అర్జీని అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాలు అందించాలని కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ సిరి
కర్నూలు కలెక్టరేట్, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి అర్జీని అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారాలు అందించాలని కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎ్‌స)లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. పీజీఆర్‌ఎ్‌సలో నమోదవుతున్న ‘రీ-ఓపెన్’, ‘ఇన్‌ప్రాపర్ రెడ్రెసల్’ కేసులను పూర్తిగా తగ్గించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, అర్జీలను గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు.