అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:42 AM
పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం, అండర్‌గౌండ్ర్ డ్రైనేజీ, అభివృద్ది పనులను స్వయంగా పరిశీలించి, సూచనలు చేశారు
ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లె, ఆగ’స్టు 2 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖామంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం, అండర్‌గౌండ్ర్ డ్రైనేజీ, అభివృద్ది పనులను స్వయంగా పరిశీలించి, సూచనలు చేశారు. ఆస్థానం రోడ్డులో పూర్తి అయిన సీసీ రోడ్డును తనిఖీ చేశారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా దారి ఏర్పాటు చేయాలని పంచాయితీరాజ్ డీఈ నాగశ్రీనివాసులును కోరారు. అలాగే పట్టణంలోని ఆస్థానంరోడ్డులో కాల్వలను సరిగా పరిశుభ్రం చేయడం లేదని ఆప్రాంత సూపర్‌వైజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణ దారులు, కిరాణా దుకాణదారులు చెత్తను కాలువలో వేయొద్దని కోరారు. ఎవరైనా కాలువలో చెత్త వేస్తే ఆ దుకాణం ముందు అదే చెత్తను వేయాలని పంచాయితీ అధికారులను ఆదేశించారు. ఆస్థానంరోడ్డు, పాతరైస్ మిల్ ప్రాంతాల్లో అండర్‌డ్రైనేజీ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లను కోరారు. ఎంపీడీవో నాగరాజు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ మధుసూధన్, ఏఈ సాయికృష్ణ, పంచాయతీ ఈవో మురళీమోహన్, ఏఈ వెంకటరమణ, విద్యుత్ ఏఈ శ్రీనివాసులు, బురానుద్దీన్, నియాజ్, సలాం, అత్తార్ అబ్దుల్‌కలాం, అమీర్‌జాన్ పాల్గొన్నారు.
ప్రజా సమస్యలను పరిష్కరించాలి: మంత్రి బీసీ
ప్రజా సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించి, అభివృద్ధికి సహకరించాలని మంత్రి ఆదేశించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరించారు. అధికారులకు ఫోన్‌చేసి పరిష్కరించారు. విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్లు, రెవెన్యూ సేవల కోసం కార్లాయాలచుట్టూ తిప్పుకోవద్దని ఆదేశించార
తాగునీటి సమస్యపై సమీక్ష..
నియోజకవర్గంలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ఆదివారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయితీ సెక్రటరీలు, ఆర్‌డబ్ల్యూఎస్ అఽధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుని, అంటువ్యాధులు రాకుండా చూడాలన్నారు.