పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Feb 03 , 2026 | 01:06 AM
సీఎం సభకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎ.సిరి అధికారులను ఆదేశించారు. కలుగొట్ల గ్రామంలో ఈనెల 7న ముఖ్యమ్రంతి నారాచంద్రబాబునాయుడు సభ ఏర్పాటుచేసిన నేపథ్యంలో సోమవారం కలుగొట్లలో కలెక్టర్‌తో పాటు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మలు పర్యటించారు. ముఖ్యమంత్రి సభకు చేయాల్సిన ఏర్పాట్లపై అఽధికారులతో చర్చించారు
కలుగొట్లలో పర్యటించిన కలెక ్టర్, ఎమ్మెల్యే
సీఎం సభ ఏర్పాట్లపై సమీక్ష
ఎమ్మిగనూరు రూరల్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): సీఎం సభకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎ.సిరి అధికారులను ఆదేశించారు. కలుగొట్ల గ్రామంలో ఈనెల 7న ముఖ్యమ్రంతి నారాచంద్రబాబునాయుడు సభ ఏర్పాటుచేసిన నేపథ్యంలో సోమవారం కలుగొట్లలో కలెక్టర్‌తో పాటు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మలు పర్యటించారు. ముఖ్యమంత్రి సభకు చేయాల్సిన ఏర్పాట్లపై అఽధికారులతో చర్చించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ నూరుల్ ఖమర్, సబ్ కలెక్టర్ అజయ్‌కుమార్, డీఎంహెచ్‌వో భాస్కర్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మనోహర్, డీపీవో భాస్కర్, డీఎ్‌సవో రాజారఘువీర్, జేడీ వరలక్ష్మి, జిల్లా సర్వేయర్ మణికన్నన్, తహసీల్దార్ శ్రీనివాసులు, టీడీపీ మండల అధ్యక్షుడు కేటీ వెంకటేశ్వర్లు, మార్కెట్ యార్డు చైర్మన్ మల్లయ్య పాల్గొన్నారు.
ఎమ్మిగనూరు: ఈ నెల 7వ సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ సిరి పిలుపునిచ్చారు. సోమవారం ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లపై సంబంధిత పలు శాఖాధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జేసీ నూరుల్ ఖమర్, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.
జగన్ మరోసారి పాదయాత్ర చేస్తానంటున్నారని, తన పాలనను ప్రజలకు మరోసారి గుర్తుచేసే దమ్ముందా? అని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రశ్నించారు. సోమవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ ఈనెల 7న సీఎం కలుగొట్ల పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. అలాగే స్థానిక గెస్ట్ హౌస్‌లో నాయకులు, కార్యకర్తలతో వారు సమావేశం నిర్వహించి సమీక్షించారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బాస్కర్ల చంద్రశేఖర్, బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.