Share News

డీఎంహెచ్‌వో మార్క్‌

ABN , Publish Date - Jun 09 , 2026 | 12:32 AM

కారుణ్య నియామకాలైన పదోన్నతులైన ఉద్యోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నుంచి వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ. ఈ నెల 1వ తేదీ పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల ప్రక్రియను పూర్తి చేసి 14 మందికి ఉత్తర్వులు జారీ చేసిన డీఎంహెచ్‌వో డాక్టర్‌ కామేశ్వర ప్రసాద్‌ తాజాగా ఆఫీస్‌ సబార్డినేట్లకు పదోన్నతులు విషయంలో అలాంటి నిర్ణయమే తీసుకున్నారు

డీఎంహెచ్‌వో మార్క్‌
కార్యాలయం, ఇన్‌సెట్‌లో డీఎంహెచ్‌వో కామేశ్వర ప్రసాద్‌

జూనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి

ఉమ్మడి జిల్లాలో ఏడుగురికి ప్రమోషన్‌

పీహెచ్‌సీలకు రిజిస్టర్‌ పోస్టుల్లో ఉత్తర్వులు

కర్నూలు హాస్పిటల్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): కారుణ్య నియామకాలైన పదోన్నతులైన ఉద్యోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నుంచి వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ. ఈ నెల 1వ తేదీ పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల ప్రక్రియను పూర్తి చేసి 14 మందికి ఉత్తర్వులు జారీ చేసిన డీఎంహెచ్‌వో డాక్టర్‌ కామేశ్వర ప్రసాద్‌ తాజాగా ఆఫీస్‌ సబార్డినేట్లకు పదోన్నతులు విషయంలో అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. జూనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఆరుగురు సబార్డినేట్లర్లు, ఓ డ్రైవర్‌కు సోమవారం కౌన్సెలింగ్‌ నిర్వహించి జూనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. అంతేకాకుండా ఉత్తర్వులను ఉద్యోగులు పని చేసే పీహెచ్‌సీలకు నేరుగా రిజిస్టర్‌ పోస్టులో పంపించారు. గతంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండేది. కారుణ్య నియామకాలైన పదోన్నతులైన, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలైనా కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. కొత్త డీఎంహెచ్‌వోగా వై.కామేశ్వర ప్రసాద్‌ బాధ్యతలు చేపట్టిన 2 నెలల కాలంలో పరిపాలన అంశాలతో పాటు, ఉద్యోగులకు సంబంధించిన న్యాయమైన ప్రయోజనాలపై దృష్టి పెట్టారు. కారుణ్య నియామకాలు, పదోన్నతులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించి వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పదోన్నతులు పొందిన వారిలో ఎం.శ్యామల (డీఎంహెచ్‌వో ఆఫీసు నుంచి లద్దగిరి పీహెచ్‌సీ), రవికుమార్‌(పారుమంచాల పీహెచ్‌సీ నుంచి దీబకుంట్ల), అశోక్‌ కుమార్‌(హుశేనాపురం పీహెచ్‌సీ నుంచి డీఎంహెచ్‌వో ఆఫీసు టైపిస్టు), మూకన్న(కోసిగి పీహెచ్‌సీ నుంచి మొలగవెళ్లి పీహెచ్‌సీ), విజయకుమార్‌(అర్ధగేరి పీహెచ్‌సీ నుంచి ఆర్‌ఎస్‌ రంగాపురం) ఇంద్రాణి (జూపాడుబంగ్లా పీహెచ్‌సీ నుంచి నంద్యాల డీఎంహెచ్‌వో ఆఫీసు) ఇక కే.శ్రీనివాసులు డ్రైవర్‌, కర్నూలు డీఎంవో ఆఫీస్‌ నుంచి జూనియర్‌ అసిస్టెంట్‌గా చిన్న మల్కాపురం పీహెచ్‌సీకి పదోన్నతి కల్పించి డీఎంహెచ్‌వో పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ సందర్బంగా డీఎంహెచ్‌వో డా.వై.కామేశ్వర ప్రసాద్‌ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆఫీస్‌ సబార్డినేట్లు పదోన్నతులు చేపట్టినట్లు తెలిపారు. కారుణ్య నియామకాలు పది పోస్టులు నిర్వహిస్తే అందులో ముగ్గురికి పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 27 కారుణ్య నియామకాలు చేపట్టగా ఏడుగురికి జూనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించి ఉత్తర్వులను సంబంధిత పీహెచ్‌సీ ఆఫీసులకు రిజిస్టర్‌ పోస్టులో పంపించినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు

Updated Date - Jun 09 , 2026 | 12:32 AM