Share News

డీజే వాహనాలు సీజ్‌

ABN , Publish Date - May 01 , 2026 | 12:16 AM

పోలీసుల అనుమతి లేకుండా గ్రామాల్లో రాత్రి పూట ఇష్టానుసారంగా సౌండ్‌ను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న డీజే వాహనాలను సీజ్‌చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రబాబు గురువారం తెలిపారు

డీజే వాహనాలు సీజ్‌
సీజ్‌ చేసిన డీజే వాహనాలను చూపుతున్న పోలీసులు

గోనెగండ్ల, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): పోలీసుల అనుమతి లేకుండా గ్రామాల్లో రాత్రి పూట ఇష్టానుసారంగా సౌండ్‌ను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న డీజే వాహనాలను సీజ్‌చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రబాబు గురువారం తెలిపారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో పెళ్లిళ్లకు డీజే వాహనాలను ఏర్పాటు చేసుకునే వారు పోలీసుల అనుమతి తీసుకొని రాత్రి పది గంటల లోపు నిలిపివేయాలని సూచించారు. అలా చేయని వారిపై చర్యలు తప్పవన్నారు. పోలీసుల హెచ్చరికలను అతిక్రమించిన వాహనాలను సీజ్‌ చేశామన్నారు. రాత్రి పది గంటల లోపు డీజేలు నిలిపివేయాలని సీఐ చంద్రబాబు ప్రకటించడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 01 , 2026 | 12:16 AM