రూ. 30 లక్షల చెక్కులు పంపిణీ
ABN , Publish Date - Aug 01 , 2026 | 11:33 PM
కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురుకి రూ.30 లక్షల చెక్కును కలెక్టర్ డా.ఏ. సిరి అందజేశారు.
కర్నూలు కలెక్టరేట్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురుకి రూ.30 లక్షల చెక్కును కలెక్టర్ డా.ఏ. సిరి అందజేశారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కొవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురి వయస్సు 23 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రధానమంత్రి కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద వంశీ, ఇందుప్రియ (కవలలు)లకు రూ.20 లక్షలు, దినేష్ ఒక్కరికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ అధికారి విజయ, జిల్లా బాలల సంరక్షణ అధికారి శారద అధికారులు పాల్గొన్నారు.