25న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:54 PM
ఈ నెల 25న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 1 నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ తెలిపారు.
డీఎంహెచ్‌వో కామేశ్వరప్రసాద్
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 25న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 1 నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ తెలిపారు. పీహెచ్‌సీ, అర్బన్ హెల్త్ సెంటర్‌లలో పని చేస్తున్న క్షేత్ర స్థాయి పర్యవేక్షకుల సమావేశం నగరంలోని జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలోని సమావేశ భవనంలో శనివారం నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ నులిపురుగులను నిర్మూలిద్దాం.. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుదాం అన్న నినాదంతో నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 25న అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కాలేజీలలో పిల్లలకు మాత్రలు మింగించాలన్నారు. ఈ మాత్రల వల్ల పిల్లల్లో రక్తహనత, పోషకాహార లోపం, బరువు తగ్గడం, లక్షణాలను నివారిస్తుందన్నారు. ఆర్‌బీఎ్‌సకే జిల్లా అధికారి డా.మహేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ సెప్టెంబరు 25న మాత్రలు వేసుకోని పిల్లలకు అక్టోబరు 5వ తేదీ మాష్ ఆప్ డే సందర్భంగా మాత్రలు వేస్తారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా టీబీ ఆఫీసర్ డా.ఎల్.భాస్కర్, డీఐవో డా.ఉమా, సంచార చికిత్స నోడల్ ఆఫీసర్ డా.విశ్వేశ్వరరెడ్డి, పీడీయాట్రిషన్ డా.సృజన, మేనేజర్ ఇర్ఫాన్ పాల్గొన్నారు.