Share News

మధ్యవర్తిత్వంతోనే వివాదాలు పరిష్కారం

ABN , Publish Date - Feb 27 , 2026 | 11:25 PM

మధ్యవర్తి త్వంతోనే వివాదాలు పరిష్కారం అవుతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు.

మధ్యవర్తిత్వంతోనే వివాదాలు పరిష్కారం
మాట్లాడుతున్న బి. లీలా వెంకటశేషాద్రి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి

కర్నూలు లీగల్‌, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): మధ్యవర్తి త్వంతోనే వివాదాలు పరిష్కారం అవుతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. శుక్రవారం స్థానిక న్యాయ సేవాసదన్‌ భవన్‌లో జరిగిన న్యాయ వాదులతో మధ్యవ ర్తిత్వంపై ఒక సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఆయన మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు ఉమ్మడి కర్నూ లు జిల్లాలోని అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వం ప్రక్రియ కోసం కేసులు స్వీకరిస్తారనీ ఆయన తెలిపారు. పలువురు న్యాయ వాదులు పాల్గొన్నారు.

బాలల హక్కులను పరిరక్షించాలి

జువైనల్‌ హోమ్‌లో ఉంటున్న బాలల హక్కులను పరిరక్షిం చడానికి కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. స్థానిక అబ్జర్వేషన్‌ హోమ్‌ ఫర్‌ బాయ్స్‌ను తనిఖీచేశారు. ఆయన మాట్లాడుతూ తెలియని వయసులో చేసిన తప్పులకు బాలలను సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. వారిని మంచి పౌరులుగా తీర్చి దిద్దాలని ఆయన కోరారు. బాలలకు అందిస్తున్న ఆహారం, వసతి, సదుపా యాలు, రికార్డులను పరిశీలించారు. అబ్జర్వేషన్‌ హోమ్‌ సూపరిం టెండెంట్‌ హుశేన్‌ బాషా, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ జుబేదా బేగం, ఇన్‌చార్జి జువైనల్‌ జస్టిస్‌ బోర్డు చైర్మన్‌ సరోజనమ్మ, మెంబర్‌ సునీత, మాధవీ, న్యాయవాది లక్ష్మినారాయణ, అధికా రులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 11:25 PM