మినుముకు తెగులు
ABN , Publish Date - Nov 14 , 2026 | 11:58 PM
ఆదుకుంటుందనుకున్న మినుము పంట తెగులు బారిన పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఈ ఏడాది 1,500 ఎకరాల్లో మినుము సాగు చేశారు. కొలిమిగుండ్ల, మీర్జాపురం, బెలుం, బెలుంశింగవరం, కల్వటాల, అబ్దులాపురం, చింతలాయపల్లె తదితర గ్రామాల రైతులు పంట వేసి అనుక్షణం కాపాడుకున్నారు.
1,500 ఎకరాల్లో సాగు, రైతుల ఆందోళన
కొలిమిగుండ్ల, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ఆదుకుంటుందనుకున్న మినుము పంట తెగులు బారిన పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఈ ఏడాది 1,500 ఎకరాల్లో మినుము సాగు చేశారు. కొలిమిగుండ్ల, మీర్జాపురం, బెలుం, బెలుంశింగవరం, కల్వటాల, అబ్దులాపురం, చింతలాయపల్లె తదితర గ్రామాల రైతులు పంట వేసి అనుక్షణం కాపాడుకున్నారు.
ఎకరాకు రూ.20వేల పెట్టుబడి..
మినుము ఎకరాకు రూ.20వేలకు పైగా పెట్టుబడి పెట్టినట్లు రైతులు అంటున్నారు. పంట పూత సమయంలో తెగులు సోకడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఆకులకు రంధ్రాలు పడి, నల్లగామారి పంట వాడిపోతుంటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు తెగులు రైతుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వ్యవసాయాధికారులు పరిశీలించి, సూచనలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.