Share News

అవగాహనతోనే వ్యాధులు దూరం

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:42 PM

ఆరోగ్య అవగాహనతో దీర్ఘకాలిక, సాధారణ వ్యాధులకు దూరంగా ఉండ వచ్చునని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు.

అవగాహనతోనే వ్యాధులు దూరం
పోస్టర్లను ఆవిష్కరిస్తున్న మంత్రి ఫరూక్‌

న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్‌

నంద్యాల రూరల్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య అవగాహనతో దీర్ఘకాలిక, సాధారణ వ్యాధులకు దూరంగా ఉండ వచ్చునని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చడమే ఈ కార్యక్రమ లక్ష్వం అన్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవుతుందన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం కోసం ప్రభుత్వం ప్రతినెల ఆర్థికసాయం చేస్తోందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్‌ శారదాబాయి, టీబీ అధికారి అంకిరెడ్డి, డాక్టర్లు పీటర్‌, జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 11:42 PM