Share News

అభ్యర్థుల ఎంపికపై కూటమి నేతల కసరత్తు

ABN , Publish Date - Oct 16 , 2026 | 11:48 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కూటమి నేతలు కసరత్తు చేపట్టారు.

అభ్యర్థుల ఎంపికపై  కూటమి నేతల కసరత్తు
ఎమ్మెల్యే కోట్లతో చర్చిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు మధు

డోన్‌ టౌన్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కూటమి నేతలు కసరత్తు చేపట్టారు. శుక్రవారం ఎమ్మెల్యే కోట్ల నివాసంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, సందు వెంకటరమణ, బొంకూరి రవికువూర్‌, ఆర్మీరామయ్య, దామోదర్‌ నాయుడు, రాజపుత్ర కమలేష్‌, సమావేశమయ్యారు. డోన్‌, బేతంచెర్లలో బీజేపీ తరుపున పోటీ చేసేందుకు 8 సీట్లు కోరగా.. మొత్తం 7 సీట్లకు ఒప్పందం కుదిరిందని అభిరుచి మధు తెలిపారు. మిగిలిన ఒక సీటు కూడా చర్చించి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే కోట్ల సూచించారు.

Updated Date - Oct 16 , 2026 | 11:48 PM