కలుషిత నీరు
ABN , Publish Date - Aug 05 , 2026 | 12:13 AM
మండలంలోని జలదుర్గం గ్రామంలో నెల రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరు తాగి తాము అతిసారం బారిన పడుతున్నట్లు వాపోయారు.
ప్యాపిలి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జలదుర్గం గ్రామంలో నెల రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీరు తాగి తాము అతిసారం బారిన పడుతున్నట్లు వాపోయారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రక్షిత తాగునీటి పథకాల పైపులైన్‌లు దెబ్బతినడంతో నీరు కలుషితమవుతోందని, అధికారులు స్పందించాలన్నారు. గ్రామంలో ఇప్పటికే దాదాపు 20మందికి పైగా అతిసారం బాధితులు ఉనారని అధికారులు నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితి మరింతి జఠిలంగా మారే అవకాశాలున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారం రోజులుగా విరేచనాలు తగ్గడం లేదు
కలుషిత నీరు తాగి వారం రోజులుగా విరోచనాలవుతున్నాయి. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదు. ఉన్నతాధికారులు స్పందించి పైలు లైన్‌కు మరమతులు చేసి స్వచ్చమైన నీటిని సరఫరా చేయాలి. - బోడెన్న, గ్రామస్థుడు