రైలు వస్తే అంతే..
ABN , Publish Date - May 13 , 2026 | 12:19 AM
: పట్టణ నడిబొడ్డులో డోన్ - బనగానపల్లె మార్గంలో రైల్వే గేటు ఉంది. దీంతో రైలు వచ్చిన ప్రతిసారి ద్విచక్రవాహనాలు, ఆటో, బస్సులు నిలిచిపోతున్నాయి. గుంతకల్లు - నంద్యాల, గూడ్స్ రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి.
రైల్వే గేటుతో వాహనదారులు, ప్రయాణికుల అవస్థలు
రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని వినతి
బేతంచెర్ల, మే 12 (ఆంధ్రజ్యోతి): పట్టణ నడిబొడ్డులో డోన్ - బనగానపల్లె మార్గంలో రైల్వే గేటు ఉంది. దీంతో రైలు వచ్చిన ప్రతిసారి ద్విచక్రవాహనాలు, ఆటో, బస్సులు నిలిచిపోతున్నాయి. గుంతకల్లు - నంద్యాల, గూడ్స్ రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి.
అరగంటకోసారి మూత..
అరగంటకు ఒకసారి రైలు వస్తుండటంతో రైల్వేగేట్ మూసివేస్తున్నారు. దీంతో ఇరువైపులా ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లు, బస్సులు, ఆటోలు నిలిచిపోతున్నాయి. ఈ మార్గం కర్నూలు- బనగానపల్లె రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కర్నూలు వైపు నుంచి బనగానపల్లె, తాడిపత్రి, ప్రొద్దుటూరు, జమ్ములమడుగు, తిరుపతికి వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
ఆర్‌యూబీ నిర్మించాలి
సమస్య శాశ్వత పరిష్కారానికి రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ విషయంలో పలుమార్లు ప్రజా ప్రతినిధులు, రైల్లే అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టినా పట్టించుకోవడం లేదని వాహనదారులు, డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వంతెనను నిర్మించాలని కోరుతున్నారు.