సాగునీరు లేక అవస్థలు
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:21 AM
మండలంలో 32గ్రామాలుండగా నీటి వనరులు లేకపోవడంతో వర్షం పడితేనే ప్రజల దాహం తీరడంతో పాటు, పంటలు పండే అవకాశం ఉంటుంది.
కొలిమిగుండ్లకు అందని అవుకు రిజర్వాయర్ నీరు
ఫ2014లో టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా అమలుకు నోచుకోని ఎత్తిపోతలు
కొలిమిగుండ్ల, జూలై 22 (ఆంధ్రజ్యోతి): మండలంలో 32గ్రామాలుండగా నీటి వనరులు లేకపోవడంతో వర్షం పడితేనే ప్రజల దాహం తీరడంతో పాటు, పంటలు పండే అవకాశం ఉంటుంది.
మండలంలో 30 వేల ఎకరాల సాగు భూమి
తిమ్మనాయినిపేట, నాగిశెట్టిపల్లె, ఎర్రగుడి, పెద్దవెంతుర్ల, కమ్మవారిపల్లె, అబ్దులాపురం, మధనంతపురం, కోరుమానుపల్లె, పేట్నీకోట గ్రామాల్లో రైతులు వ్యవసయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ 30వేల ఎకరాల భూమి సాగవుతోంది. అయితే నీటి వనరులు లేకపోవడంతో వర్షాలు కురిస్తేనే పంటలు సాగవుతాయి. భూగర్భ జలాలు ఎండిపోవడంతో బోర్ల నుంచి నీరు రావడం లేదు.
టీడీపీ ప్రభుత్వంపై ఆశలు
టీడీపీ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిస్తుందని కొలిమిగుండ్లకు చెందిన రైతులు, ప్రజల ఆశిస్తున్నారు. బీసీ జనార్థనరెడ్డి మంత్రిగా పనిచేస్తుండటంతో తాగు, సాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం దొరుకుందనే నమ్మకంతో ఉన్నారు.
పక్కనే అవుకు రిజర్వాయర్ ఉన్నా అందని నీరు..
కొలిమిగుండ్ల పక్కనే అవుకు రిజర్వాయర్ ఉంంది. అయితే ఆ నీరు జీఎన్‌ఎన్‌ఎ్‌స కాలువ ద్వారా ఇక్కడి నుంచే కడప, చిత్తూరు జిల్లాలకు నీరు పారుతోంది. అయితే కొలిమిగుండ్లకు మాత్రం ఆ నీరు అందడం లేదు.
రూ.510 కోట్లతో వాటర్ గ్రిడ్
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో మంత్రి బీసీ వాటర్‌గ్రిడ్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. రూ.510కోట్లతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటి వసతి కల్పనకు ప్రభుత్వం ఇప్పటికే అమోదం తెలిపింది.
గత టీడీపీ హయాంలో ఎత్తిపోతలకు అనుమతి..
2014లో టీడీపీ అధికారంలోక వచ్చాక నాటి ఎమ్మెల్యే, ప్రస్థుత మంత్రి బీసీ జనార్దనరెడ్డి కొలిమిగుండ్ల మండల కష్టాలు తీర్చడానికి ప్రయత్నించారు. సీఎం చంద్రబాబాబు వద్ద పట్టుబట్టి 2018లో తిమ్మనాయినిపేట చెరువుకు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించారు. జీఎన్‌ఎన్‌ఎ్‌స కాలువ నుంచి చెరువులు నింపేందుకు అనుమతి తీసుకవచ్చారు. అయితే అంతలోనే 2019లో వైసీపీ అధికారంలోకి రావడతో ఆ ప్రయత్నం మరుగు పడింది. అయిదేళ్ల పాలనలో వైసీపీ నాయకులు ఆ దిశగా ప్రయత్నించలేదని రైతులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు.
సాగునీటి వనరులు కల్పించాలి
సాగునీటి వనరులు కల్పిస్తే పంటలు పండించడానికి ఆసక్తిగా ఉన్నాం. తిమ్మనాయినిపేట చెరువును అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతంలో పంటలు సాగుచేసే అవకాశం ఉంది. - రాజేశ్వరరెడ్డి, రైతు, నందిపాడు
ప్రభుత్వం స్పందించాలి
కొలిమిగుండ్లలో నీటి వనరులు లేకపోవంతో మండలం ఎడారిగా మారుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కరుణించి, నిధులు మంజూరు చేసి అవుకు రిజర్వాయర్ నుంచి మండలంలో చెరువులు నింపి, ప్రజల కష్టాలు గట్టెక్కించాలి. - పుల్లయ్య , రైతు సంఘం ఉపాధ్యక్షుడు