Share News

తప్పని గ్యాస్‌ కష్టాలు

ABN , Publish Date - May 20 , 2026 | 12:07 AM

: మండలంలో వంటగ్యాస్‌ వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. సుమారు నెలన్నర నుంచి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్‌ బుక్‌చేసిన 20, 25 రోజుల తర్వాత కూడా డెలివరీ ఇవ్వడం లేదంటున్నారు. కొలమిగుండ్లలో భారత్‌, హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీలు ఉండగా సుమారు 14వేలకుపైగా వినియోగదారులు ఉన్నారు.

తప్పని గ్యాస్‌ కష్టాలు
సిలిండర్ కోసం వేచి ఉన్న వినియోగదారులు

కొలిమిగుండ్ల, మే 19 (ఆంధ్రజ్యోతి): మండలంలో వంటగ్యాస్‌ వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. సుమారు నెలన్నర నుంచి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్‌ బుక్‌చేసిన 20, 25 రోజుల తర్వాత కూడా డెలివరీ ఇవ్వడం లేదంటున్నారు. కొలమిగుండ్లలో భారత్‌, హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీలు ఉండగా సుమారు 14వేలకుపైగా వినియోగదారులు ఉన్నారు.

బ్లాక్‌ మార్కెటింగ్‌..

ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్లను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారని, అందుకే కొరత వస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం బనగానపల్లెలో అక్రమాలకు పాల్పడుతున్న గ్యాస్‌ గోడౌన్‌పై అధికారులు దాడులుచేసి గ్యాస్‌ ఏజన్సీని సీజ్‌చేయడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

చిరు వ్యాపారుల అవస్థలు..

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ అందకపోవడంతో చిన్న చిన్న హోటల్లు, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులు అసవస్థలు పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. మరికిందరు బ్లాక్‌ మార్కెట్లో గ్యాస్‌ సిలిండర్లను కొంటున్నారు. మరోమారు యుద్ధం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అనడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ చర్యలు తీసకుని ప్రజలకు గ్యాస్‌ కష్టాలను తొలగించాలని కోరుతున్నారు.

బుక్‌ చేసిన నెల దాటింది..

సిలిండర్‌ బుక్‌ చేసి నెల గడిచింది. నేటీకీ డెలివరీ ఇవ్వలేదు. పైగా గ్రామాలకు గ్యాస్‌ఆటో 15 రోజులకు ఒక్కసారి మాత్రమే వస్తుందని ఏజన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో కష్టాలు తప్పడంలేదు. - కొండయ్యగౌడ్‌, వినియోగదారుడు, - అబ్దుల్లాపురం

Updated Date - May 20 , 2026 | 12:07 AM