వేధిస్తున్న డీజిల్ కొరత
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:23 AM
ఇందన కొరత ఇంకా పరిష్కారం కాలేదు. ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకులకు డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా చేయడం లేదు. పెట్రోలు లభిస్తున్నా డీజిల్ అందుబాటులో లేదు.
రబీ పంట కోతకు రైతుల ఇబ్బందులు
ప్యాపిలి మండలంలో లభించని పెట్రోలు, డీజిల్
చాగలమర్రి, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ఇందన కొరత ఇంకా పరిష్కారం కాలేదు. ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకులకు డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా చేయడం లేదు. పెట్రోలు లభిస్తున్నా డీజిల్ అందుబాటులో లేదు. దీంతో బంకులు యజమానులు వారి వద్ద ఉన్న కొద్దిపాటి నిల్వలతో విక్రయాలు చేస్తున్నారు. మండలంలోని బంకులు మూతబడ్డాయి. రబీ సీజన్‌కు సంబంధించిన పంట కోతల యంత్రాలకు అవసరమయ్యే డిజిల్ కోసం అధికారుల వద్ద టోకన్ తీసుకొని బంకుల వద్ద డిజిల్ తీసుకెళ్లాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో డిజిల్ లభించక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
పెట్రోలు బంకులు బంద్
ప్యాపిలి: మండలంలోని చిగురుమాను మిట్ట, గార్లదిన్నె గ్రామాల్లోని పెట్రోలు బంకులు వారం రోజులుగా బందయ్యాయి. దీంతో రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతాలకు కూడా పెట్రోలు, డీజిల్‌ను తగినంతగా సరఫరా చేయాలని వాహనదారులు, రైతులు కోరుతున్నారు.