Share News

మినుము రైతుకు కష్టం

ABN , Publish Date - Sep 03 , 2026 | 12:22 AM

ఎల్‌నినో ప్రభావం ఖరీఫ్‌ పంటలపై బాగా ప్రభావం చూపిస్తోంది. మండలంలె 5300 ఎకరాల్లో మినుము సాగు చేశారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న తమను ఆదుకుంటుందని సాగుచేస్తే దిగుబడి తగ్గి నష్టాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మినుము రైతుకు కష్టం
రెడ్డిపల్లె మెట్ట వద్ద ఆరబోసిన మినుములు

ఎల్‌నినో ప్రభావంతో దెబ్బతిన్న మొక్కలు ఫ ఎకరాకు నాలుగు క్వింటాళ్ల దిగుబడితో నష్టం

రుద్రవరం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావం ఖరీఫ్‌ పంటలపై బాగా ప్రభావం చూపిస్తోంది. మండలంలె 5300 ఎకరాల్లో మినుము సాగు చేశారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న తమను ఆదుకుంటుందని సాగుచేస్తే దిగుబడి తగ్గి నష్టాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తగ్గిన దిగుబడి..

సాధారణంగా మినుము సాగులో ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. అయితే ఈ ఏడాది కేవలం 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని రైతులు వాపోయారు. ఎండలు, గాలి దెబ్బకు మొక్కల్లో ఎదుగుదల లేదని రైతులు అంటున్నారు. తాము ఎకరాకు రూ.50వేల నుంచి రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టామన్నారు. మార్కెట్లఓ క్వింటా మినుములు నాణ్యతను బట్టి రూ.4వేల నుంచి రూ.8వేల వరకు ధర పలుకుతోంది. అయితే దిగుబడి లేకపోవడంతో నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

నాలుగు క్వింటాళ్లు మాత్రమే వచ్చింది

ఎకరాలో మినుములు సాగుచేశా. రూ.50వేల పెట్టుబడి పెట్టాను. అయితే వాతావరణం అనుకూలింక కేవలం నాలుగు క్వింటాల్ల దిగుబడి వచ్చింది. 50వేల రూపాయలు పెట్టుబడి పెట్టా. దీంతో దాదాపు రూ.15వేల వరకు నష్టం వచ్చింది. - శ్రీనివాసులు, రైతు, రెడ్డిపల్లె

మినుముతో నష్టపోయాం

ఈ ఖరీ్‌ఫలో మినుము సాగుచేసి నష్టపోయాం. ఈ ఏడాది ఎండ ఎక్కువగా ఉండటంతో మొక్కల్లో ఎదుగుదల లేదు. ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. -బాలనరసింహులు, రైతు, పెద్దకంబలూరు

Updated Date - Sep 03 , 2026 | 12:22 AM