డైట్ టెండర్ మళ్లీ వాయిదా
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:09 AM
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు సరఫరా చేసే డైట్ టెండర్ మళ్లీ వాయిదా పడింది. కర్నూలు జీజీహెచ్, క్యాన్సర్ హాస్పిటల్, ఐ-హాస్పిటల్ రోగులకు ఆహారం అందించే డైట్ టెండర్‌కు ఫిబ్రవరి 5వ తేదీన టెండర్ ముగియాల్సి ఉండగా.. సీఎం పర్యటన నేపథ్యంలో దీన్ని వాయిదా వేశారు.
కర్నూలు హాస్పిటల్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు సరఫరా చేసే డైట్ టెండర్ మళ్లీ వాయిదా పడింది. కర్నూలు జీజీహెచ్, క్యాన్సర్ హాస్పిటల్, ఐ-హాస్పిటల్ రోగులకు ఆహారం అందించే డైట్ టెండర్‌కు ఫిబ్రవరి 5వ తేదీన టెండర్ ముగియాల్సి ఉండగా.. సీఎం పర్యటన నేపథ్యంలో దీన్ని వాయిదా వేశారు. తాజాగా ఈ టెండర్‌ను దక్కించుకునేందుకు నేతల అండదండలతో ఫైరవీలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం డైట్ టెండర్‌దారులను ఖరారు చేసేందుకు కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ సమక్షంలో ఫెనాన్షియల్ బిడ్‌ను ఓపెన్ చేశారు. ఈ ఫెనాన్షియల్ బిడ్ తర్వాత టెండర్‌ను ఖరారు చేయాలి. అయితే ఓ అధికారి అత్యుత్సాహంతో మళ్లీ టెండర్ వివరాలు తెలియజేస్తామని చెప్పడంతో డైట్ కాంట్రాక్టు బిడ్డ్డర్లు నిరాశతో వెనుదిరిగారు. ఇప్పటి వరకు డైట్ టెండర్‌కు 15 మంది దరఖాస్తులు తీసుకోగా, 11 మంది మాత్రమే టెండర్ వేశారు. ఈ 11 మందిలో ఆరుగురు డైట్ కాంట్రాక్టు బిడ్డర్లు మాత్రమే అర్హత పొందినట్లు మిగిలిన బిడ్డర్లు మరికొన్ని వివరాలు, పత్రాలు అందజేయాలని అధికారులు కోరినట్లు సమాచారం. డైట్ టెండర్ విషయంలో ఆసుపత్రిలో కొందరు అధికారులు, సిబ్బంది ఓ కాంట్రాక్టు బిడ్డర్‌కు అర్హత లేకపోయినా అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఆ కాంట్రాక్టర్‌కే టెండర్‌ను అప్పజెప్పుతున్నట్లు సమాచారం.
జేసీకి పిర్యాదు
డైట్ టెండర్‌కు సంబంధించిన ఐకాన్ వికేర్‌పై 8 మంది డైట్ కాంట్రాక్టు బిడ్డర్లు మంగళవారం జాయింట్ కలెక్టర్‌కు హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. డైట్ నిర్వహణకు సంబందించినవీకేర్‌కు 500 పడకలకు పైగా ఆసుపత్రి రోగులకు ఆహారం అందించలేదని, ఇది ముఖ్యమైన అంశమని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్హత లేకపోయిన ఆ డైట్ కాంట్రాక్టు బిడ్డర్‌ను ఎలా జాబితాలో చేర్చాలో తెలియజేయాలన్నారు. ఈ బిడ్డర్‌కు సంబంధించిన జీఎ్‌సటీ రిటర్న్‌లు, ఆదాయ పన్ను వివరాలు పరిశీలించాలని డాక్యుమెంటేషన్‌లు వివరాలు సేకరించాలన్నారు. టెండర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు.