Share News

మధుమేహ రోగులు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Nov 14 , 2026 | 11:31 PM

మధుమేహ వ్యాధి అన్ని అవయ వాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, రోగులు అప్రమత్తంగా ఉండి చికిత్స చేయించుకో వాలని డీఎంహెచ్‌వో డా.వై.కామేశ్వర ప్రసాద్‌ అన్నారు.

మధుమేహ రోగులు అప్రమత్తంగా ఉండాలి
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డీఎంహెచ్‌వో

డీఎంహెచ్‌వో డా.వై.కామేశ్వర ప్రసాద్‌

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): మధుమేహ వ్యాధి అన్ని అవయ వాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, రోగులు అప్రమత్తంగా ఉండి చికిత్స చేయించుకో వాలని డీఎంహెచ్‌వో డా.వై.కామేశ్వర ప్రసాద్‌ అన్నారు. శనివారం వరల్డ్‌ డయాబెటిస్‌ డేను పురస్కరించుకుని ఆర్‌బీఎ్‌సకే ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆయన పోస్టర్‌ను ఆవిష్కరించారు. మధుమేహంను అశ్రద్ధచేస్తే గుండె, కంటి చూపుపై ప్రభావం చూపుతుందని, చూపు కోల్పోయి నరాలు చచ్చుబడుతుందని హెచ్చరించారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు మారిన జీవనశైలి వల్ల వ్యాధి వచ్చే అవకాశాలున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్రమిత వ్యాధుల నియంత్రణ అధికారి డా.మహేశ్వరప్రసాద్‌, జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వర్లు, డిప్యూటీ మలేరి యా అధికారి చంద్రశేఖర్‌, ఫ్లోరోసిస్‌ కన్సల్టెంట్‌ సుధాకర్‌ యాదవ్‌, ఎపిడమాలజిస్టు వేణుగోపాల్‌, ప్రొజెక్షనిస్టు ఖలీల్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2026 | 11:31 PM