ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలి
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:06 AM
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన వెంటనే రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు క్రాంతినాయుడు అన్నారు.
కర్నూలు అర్బన్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన వెంటనే రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు క్రాంతినాయుడు అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసు లాఠీచార్జి చేసి గాయపర్చడం అత్యంత బాధాకరమన్నారు. నిరాయుధులైన విద్యార్థులపై శక్తిని ప్రయోగించడం ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధమన్నారు. నాయకులు బతుకన్న, షేక్ ఖాజాహుసేన, రేపల్లే ప్రతాప్ పాల్గొన్నారు.