Share News

ధర్మేంధ్ర ప్రధానను తక్షణమే తొలగించాలి

ABN , Publish Date - Jul 23 , 2026 | 12:30 AM

నీట్‌ పరీక్ష పేపర్ల లీక్‌ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధానను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి.

ధర్మేంధ్ర ప్రధానను తక్షణమే తొలగించాలి
కలెక్టరేట్‌ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

కర్నూలు కల్చరల్‌, జూలై 22(ఆంధ్రజ్యోతి): నీట్‌ పరీక్ష పేపర్ల లీక్‌ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధానను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ప్రజా అభ్యుదయ సంస్థ (పీఓపీ), ప్రజా పరిరక్షణ సమితి (పీఓఎస్‌) సంస్థల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. పీఓపీ సంస్థ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థులపై జరుగుతున్న అమానుష చర్యలను నిలిపివే యాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. డీటీఎఫ్‌ నాయకుడు రత్నం ఏసేపు మాట్లాడుతూ పోలీసుల ముసుగులో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ర్యాలీలో చొరబడ్డారని, వారివల్లే విధ్వంస సంఘటనలు జరిగాయన్నారు. రచయితలు మారుతి, ఇనాయ తుల్లా మాట్లాడుతూ ఇరవై రెండు లక్షల మంది జీవితాలతో కేంద్ర ప్రభు త్వం ఆటలాడిందన్నారు. కార్యక్రమంలో ప్రజా అభిలాష సంస్థ నాయకుడు డేవిడ్‌, జన సంరక్షణ సంస్థ నాయకుడు రజాక్‌వలి, ఎస్‌డీపీఐ నాయకుడు షకీల్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 12:30 AM