Share News

మంత్రాలయంలో పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - May 29 , 2026 | 12:15 AM

రాఘవేంద్ర స్వామి దర్శ నార్థం మంత్రాలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం బక్రీద్‌ సెలవు, ద్వాదశి శుభదినం కావటంతో ఆంరఽధా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.

మంత్రాలయంలో పోటెత్తిన భక్తులు
మధ్వమార్గ్‌ కారిడార్‌లో రద్దీగా ఉన్న భక్తులు

దర్శనానికి ఏడు గంటల సమయం

మంత్రాలయం, మే 28(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి దర్శ నార్థం మంత్రాలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం బక్రీద్‌ సెలవు, ద్వాదశి శుభదినం కావటంతో ఆంరఽధా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అన్నపూర్ణ భోజ నశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్‌ కారిడార్‌, ప్రధాన రోడ్లు, రాఘ వేంద్ర సర్కిల్‌, తుంగభద్ర నదీతీరం భక్తులతో కోలాహలంగా మారింది. భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామదేవత మం చాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో సాధారణ దర్శనానికి ఏడు గంటల సమయం పట్టింది.

Updated Date - May 29 , 2026 | 12:15 AM