Share News

భక్తులు సంతృప్తి చెందాలి

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:44 PM

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సంతృప్తి చెందేలా ఏర్పాట్లు చేయాలని శ్రీశైల దేవస్థాన ఈవో శ్రీనివాసరావు అన్నారు.

భక్తులు సంతృప్తి చెందాలి
సమావేశంలో పాల్గొన్న అధికారులు

శ్రీశైలం దేవస్థాన ఈవో శ్రీనివాసరావు

శ్రీశైలం, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మ వార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సంతృప్తి చెందేలా ఏర్పాట్లు చేయాలని శ్రీశైల దేవస్థాన ఈవో శ్రీనివాసరావు అన్నారు. గురు వారం సాయంత్రం పరిపాలన భవనంలో భక్తుల అవసరాలు, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఆయన మా ట్లాడుతూ సిబ్బంది భాద్యతాయుతంగా విధులు నిర్వహించాల న్నారు. ఉభయ దేవాల యాల దర్శనాలు, ప్రసాదాలు, అన్నప్రసాదము తదితర వస తుల కల్పన ఉపయోగకరంగా ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చర్యలు తీసు కోవాలన్నారు. ఎండలకు రోడ్లపై నడవడం కష్టసాధ్యంగా ఉన్నం దున దారి పోడవునా చలువపందిళ్లు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్‌ అధికా రులను ఆదేశించారు. పారిశు ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్షేత్ర పురవీ ధుల్లో చలివేంద్రాలు ఏర్పాటుచేసి నిరంతం తాగునీరు, మజ్జిగ పంపి ణీ చే సేందుకు సన్నాహాలు చేయాలన్నారు. ఆలయ పరిధిలో విధులు నిర్వహి స్తున్న సెక్యూరిటీ సిబ్బంది భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలని సూ చించారు.

Updated Date - Apr 23 , 2026 | 11:44 PM