Share News

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Apr 02 , 2026 | 11:25 PM

ప్రముఖ పుణ్యక్షేత్ర మైన మంత్రాలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం రాఘవేంద్ర స్వామికి ఇష్టమైన దినం కావటంతో దక్షిణాది రాష్ర్టాల నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు.

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు
మఠం ప్రాంగణంలో రద్దీగా ఉన్న భక్తులు

మంత్రాలయం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్ర మైన మంత్రాలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం రాఘవేంద్ర స్వామికి ఇష్టమైన దినం కావటంతో దక్షిణాది రాష్ర్టాల నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. మఠం ప్రాంగణం భక్తులతో కిక్కి రిసిం ది. అన్నపూర్ణ భోజనశాల, మహా ముఖద్వారం, ప్రధాన రోడ్లు, మధ్వ మార్గ్‌ కారిడార్‌, రాఘవేంద్ర సర్కిల్‌ భక్తులతో కోలాహాలంగా మా రాయి. పరిమళప్రసాదం వద్ద భక్తులు భారీగా క్యూలో నిల్చున్నారు. రద్దీ పెరగడంతో పూజ సామగ్రికి, ప్రైవేట్‌ లాడ్జిలకు డిమాండ్‌ పెరి గింది. పీఠాధిపతి భక్తులకు శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.

Updated Date - Apr 02 , 2026 | 11:25 PM