శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Sep 06 , 2026 | 11:46 PM
శ్రీశైల ఆదిదంపతుల దర్శన చేసుకున్న భక్తుల పరవశించిపోయారు.
శ్రీశైలం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల ఆదిదంపతుల దర్శన చేసుకున్న భక్తుల పరవశించిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తుల శివనామస్మరణతో క్షేత్ర పురవీధులు, క్యూలైన్లు కంపార్టుమెంట్లు మర్మోగిపోతూ ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతారణం నెలకొంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉచిత శీఘ్ర అతిశీఘ్ర దర్శనాలు చేసుకునే భక్తులకు రాత్రి వరకు అలంకార దర్శనాలు మాత్రమే కల్పించారు. ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్లు, మనమిత్ర వాట్సాప్ ద్వారా ముందుగా విడుదల చేసిన పరిమిత స్పర్శ దర్శనం టికెట్లు నమోదు చేసుకున్న భక్తులతో పాటు సిఫార్సు లేఖల ద్వార వచ్చిన వీఐపీ బ్రేక్ స్పర్శ దర్శనం టికెట్లు కేటాయించిన వారికి కూడా రాత్రి 8 గంటల నుంచి ఆలయ ప్రవేశానికి అనుమతించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్న ప్రసాద భవనంలో శుచి శుభ్రతతో వండిన వంటకాలను వడ్డించారు. ఆర్జిత సేవా టికెట్లు, దర్శనం, లడ్డూ ప్రసాదాలు, కేశఖండన టికెట్లను దేవదాయశాఖ అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే నమోదు చేసుకోవాలని ఈవో శ్రీనివాసరావు భక్తులను కోరారు.